ఇదేం రూల్‌రా బాబు..! భార్యను ఇంటికి తెచ్చుకుంటే రోజుకు రూ. 1200 కట్టాల్సిందే..!

-

పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ఇంటికి తీసుకెళ్లడం ఎక్కడైన జరిగే విషయమే. కానీ అక్కడ మాత్రం భార్యను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాలి అంటే.. పైసల్‌ కట్టాల్సిందే. అది కూడా రోజుకు రూ. 1200. ఇదెక్కడి రూల్‌రా బాబూ అనుకుంటున్నారా..? ఎక్కడో కాదు.. పక్కనే ఉన్న భూటాన్‌లో.. భూటాన్‌కు చెందిన అబ్బాయిలు ఇండియాలోని అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే ఈ రూల్‌ కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఒకవేళ పెళ్లి కూతుర్ని తనతో పాటు ఇంటికి తీసుకురావాలంటే ప్రభుత్వానికి రోజుకు రూ.1200 చెల్లించాలి.
పాపం ఈ రూల్ కారణంగా ఇప్పటికీ చాలా మంది జంటలు కలిసి ఉండటం లేదు. హిమాచల్‌ప్రదేశ్‌లోని 40 ఏళ్ల చోకీ వాంగ్మో..ఇప్పటికీ తన భర్తతో కలిసి ఉండేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తుంది.. 2019లో పుష్పేంద్ర సింగ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది. ఆ వ్యక్తి భూటాన్‌లో పని చేస్తున్నాడు. పైగా అతడు భారత దేశ పౌరుడు. అయితే…భూటాన్‌లో పని చేసేందుకు వర్క్ పర్మిట్ ఉంది. ప్రతి మూడు నెలలకోసారి వర్క్ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకుంటాడు.. అయితే…అక్కడికి తన భార్యను మాత్రం తీసుకెళ్లలేకపోతున్నాడు. మూడేళ్లుగా ఇలా ఇద్దరూ ఒక్కో చోట ఉంటున్నారు. నిజానికి..ఈ రూల్ గురించి తెలిసే వధువు వాళ్ల ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ఎలాగోలా బతిమాలి ఇద్దరూ పెళ్లి చేసుకున్నా..భూటాన్ ప్రభుత్వం పెట్టిన రూల్‌తో ఇలా వేరుగా ఉండాల్సి వస్తోంది.
Sustainable Development Fee (SDF) కింద రూ.1,200 వసూలు చేస్తోంది భూటాన్ ప్రభుత్వం. అంతకు ముందు భారతీయులకు ఈ రూల్ అమల్లో ఉండేది కాదు. కానీ..కొవిడ్ తరవాత ఆదాయం పెంచుకోవడానికి.. ఇండియాకూ ఈ రూల్‌ని అప్లై చేసేసింది భూటాన్. అయితే..ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఒకవేళ భూటాన్ నుంచి మ్యారేజ్ సర్టిఫికేట్‌ తీసుకుంటే ఈ పంచాయితీ ఉండదు.. కానీ…ఇది అంత తేలిగ్గా ఇవ్వరు..15 ఏళ్లుగా మ్యారేజ్ సర్టిఫికేట్‌ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు…ఇది కేవలం ఈ ఒక్క జంట సమస్యే కాదు. ఇలా ఎన్నో జంటలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇక మరో రూల్ ఏంటంటే…ఒకవేళ ఇండియా నుంచి ఎవరైనా భూటాన్‌కు వెళ్లి ఓ 10 రోజుల పాటు ఉంటే కచ్చితంగా గైడ్‌ను పెట్టుకోవాల్సిందే. అందుకోసం రోజుకి రూ.1,500 కట్టాలి. ఇదే భూటాన్ పౌరులు ఇండియాకు వస్తే మాత్రం ఇలాంటి రూల్స్‌ ఏమీ లేవు. వాళ్లు సింపుల్‌గా వచ్చి ఇక్కడే ఉండొచ్చు.
దాదాపు రెండేళ్ల పాటు భూటాన్‌ సరిహద్దులు కొవిడ్ కారణంగా మూసేశారు. ఆ మేరకు ఆ దేశానికి ఆదాయం ఘోరంగా పడిపోయింది. కరోనా తగ్గుముఖం పట్టాక మళ్లీ బార్డర్‌ను రీఓపెన్ చేశారు. పర్యాటకుల నుంచి విజిటర్ ట్యాక్స్ కింద రోజువారీగా డబ్బులు వసూలు చేస్తోంది భూటాన్. ఒక్కో దేశం నుంచి వచ్చే వాళ్లకు ఒక్కో విధంగా ఈ ట్యాక్స్‌లు పెట్టింది. అసలు ఎందుకిలా అంటే…? రెవెన్యూ పెంచుకోడానికి అని సమాధానమిస్తోంది. పర్యాటకమే ఇక్కడి ప్రధాన ఆదాయ వనరు. అందుకే…ఆ టూరిజం నుంచే వీలైనంత ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తుంది.. పాపం ఈ రూల్‌తో పెళ్లైనా చాలామంది బ్రహ్మచారిలా ఉండిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version