ఫ్యాషన్ ప్రపంచంలో భాగంగా అందరూ మోడ్రన్ మోడ్రన్ డ్రస్సులు వేసుకుంటున్నారు. జీన్స్‌ల్లోనే బోలెడు రకాలు, ఇక టాప్స్‌లో కూడా వెరైటీలు ఉన్నాయి. అయితే మీరు గమనించారో లేదో.. షర్ట్ బటన్స్ అమ్మాయిలకు ఎడమవైపు, అబ్బాయిలకు కుడివైపు ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటుంది. అలా ఎందుకు ఉంటాయి అన్న అనుమానం కూడా మీకు వచ్చి ఉండదు. కానీ దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..!
ఆడవారికి ఎడమ చేతి వాటం , మగవారికి కుడి చేతివాటం ఉంటుంది కాబట్టి అలా పెట్టారు అనుకుంటారమో. ఎందుకంటే ప్రపంచంలో 90 శాతం మందికి పైన కుడి చేతివాటం కలిగి ఉంటారు.. పైగా చేతివాటానికి స్త్రీ పురుష భేదం ఉండదు. మరి ఇలా ఎందుకు అబ్బా.. పూర్వం యూరోపియన్ మహిళలు దుస్తులు ధరించిన విధానాన్ని అనుసరించి ఇలా గుండీలు ఉండే విధానంలో మార్పులు వచ్చాయి.
రీనేసన్స్ ( పునరుజ్జీవనోద్యమం) విక్టోరియా శకం లాంటి చారిత్రక కాలాలను మహిళలు దుస్తులు పురుషుల దుస్తులు కంటే ఎంతో భిన్నంగా, క్లిష్టంగా ఉండేవి. పైగా అప్పటిలో విలాసవంతమైన దుస్తులు ధరించే అడవారు సంపన్నులై ఉండేవారు కాబట్టి వారి దుస్తులను ఎక్కువగా పని వారు తొడగడంలో సహాయం చేసేవారు. వారికి అణువుగా ఉండడం కోసం బటన్స్ ఏడమ వైపుకు అమర్చేవాళ్లట.
అప్పటిలో మగవారు ఎక్కువగా సైన్యంలో పనిచేసేవారు. సైనికులు ఎక్కువగా ఆయుధాలను కుడి చేతితో వాడుతారు కాబట్టి దుస్తులకు బటన్లు కుడి వైపున నిర్మించడం వల్ల ఎడమ చేతితో అన్బటన్ చేయడం సర్దుబాటు చేయడం వంటివి సులభంగా చేయవచ్చు. అసలు ఇది ఎలా వచ్చింది అన్న విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఫ్యాషన్‌కి అనుగుణంగా కుడియడమైన పర్వాలేదు అనే విధంగా అందరి దుస్తులు తారుమారుగా డిజైన్ చేస్తున్నారు.