పుట్టినవాడికి మరణం తప్పదు..చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో బతుకున్నప్పుడే తెలుసుకోవడంలో కాస్త ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. అయిన వాళ్లను పోగుట్టుకున్న దుఃఖంలో ఏడుస్తూ ఉంటారు కానీ.. ఆ టైంలో కొన్ని నియమాలను పాటిస్తారు. మృతదేహం దగ్గర దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.? ఒక వేళ వ్యక్తి సాయంత్రం చనిపోతే దహనసంస్కారాలు ఉదయమే చేస్తారు. శవం దగ్గర ఎవరో ఒకరు కచ్చితంగా ఉంటారు. ఏడుస్తూ శవం చుట్టూ అందరూ గుమిగూడటం సహజం కానీ అలా బాధతో కాదు.. శాస్త్రం ప్రకారం కూడా ఎవరో ఒకరు ఉండాలట..! ఏంటి ఇవన్నీ..వీటికి కారణాలేంటో చూద్దాం..!
ఒక వ్యక్తి సూర్యాస్తమయం తర్వాత మరణిస్తే అతని దహన సంస్కారాలు మరుసటి రోజు ఉదయం మాత్రమే జరుగుతాయి. ఈ సమయంలో మృతదేహాన్ని రాత్రంతా నేలపై ఉంచుతారు. ఎవరో ఒకరు కచ్చితంగా రాత్రంతా దానితో కూర్చుంటారు. గరుడ పురాణం ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత దహనం చేస్తే ఆ వ్యక్తి మోక్షాన్ని పొందలేడట. అందుకే దహన సంస్కారాలకు సరైన సమయాన్ని ఎంచుకోవడం అవసరమని పురణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
గరుడ పురాణం ప్రకారం.. మృతదేహాన్ని ఒంటరిగా వదిలినట్లయితే రాత్రి సమయంలో దుష్టాత్మ దానిలోకి ప్రవేశించి కొన్ని చెడు పనులు చేస్తోందట. అందుకే రాత్రిపూట ఎవరో ఒకరు ఖచ్చితంగా మృతదేహం దగ్గర కూర్చుని ఆ ప్రదేశం శుభ్రంగా ఉంచుతారు.
ఏ దుష్టాత్మ మృతదేహంలోకి ప్రవేశించకుండా అక్కడ దీపం వెలిగిస్తారు. హిందూమతం ప్రకారం… మృతదేహం అంతిమ సంస్కారాలు మరణించిన వారి కుమారుడు లేదా కుమార్తె మాత్రమే నిర్వహిస్తారు. అప్పుడే పున్నామనరకం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. ఒకవేళ అతడి కుమారులు, కూతురులు దూరంగా ఉంటే వారు వచ్చే వరకు వేచి చూస్తారు. అంత్యక్రియలను అతడి కొడుకు ద్వారా జరిపిస్తారు. దీని వల్ల మరణించినవారి ఆత్మకు శాంతి లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. లేకపోతే ఆత్మ పునర్జన్మ లేదా మోక్షం కోసం తిరుగుతూనే ఉంటుందని గరుడపురాణంలో చెప్పడం జరిగింది.
చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. ఇవన్నీ ఎంతవరకూ నిజమో కూడా చెప్పలేం. బతికున్నప్పుడు దేన్ని నమ్మరూ.. అదే చనిపోయాక ఏం చెప్పినా నమ్మకంతో పాటించేస్తారు. మనిషి జీవితం అంతా పోరాటంతోనే సమిసిపోతుంది.. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో మదనపడుతూనే ఉంటాం.. అలాంటి ఆత్మకు శాంతి.. శాశ్వత నిద్రలోకి జారుకున్నప్పుడే అయితే.. దుష్టశక్తులు లాంటి నెగిటివ్ ఎనర్జీ ఆ ఆత్మను ఇబ్బందిపెట్టకుండా ఉండాలంటే చేయాల్సిన కార్యాలు సక్రమంగా చేయడమే ఉత్తమం.!