మరి సిగరెట్ హానికరం కాదా సార్…? సిగరెట్ ఎందుకు బాన్ చేయడం లేదు…?

-

సమాజంలో కొన్ని కొన్ని ప్రకటనలు చాలా వింతగానూ విడ్డూరంగాను ఉంటాయి అనేది వాస్తవం. ధూమపానం ఆరోగ్యానికి హానికరం, పొగ తాగడం క్యాన్సర్ కారకం అని ఊపిరితిత్తుల బొమ్మలు, కిడ్నీల బొమ్మలు వేసి ప్రచారం చేస్తూ ఉంటారు. కాని వాటిని బాన్ చేసే అవకాశం ఉన్నా సరే ప్రభుత్వాలు మాత్రం ముందుకి రావడం లేదు. ప్లాస్టిక్ వాడకం నిషేదిద్దాం అని చెప్పుకునే ప్రభుత్వాలు వాటి ఉత్పత్తుల విషయంలో మాత్రం ఏ విధంగా చర్యలు తీసుకోకుండా వాడే ప్రజల మీద తమ పెత్తనం చెలాయిస్తూ ఉంటాయి.

ఇటీవల గుంటూరు జిల్లాలో ప్లాస్టిక్ వాడుతున్నాడు అనే కారణంతో ఒక చిరు వ్యాపారిని బూతులు తిడుతూ కొందరు అధికారులు నానా హడావుడి చేసారు. ఇక ఆ వ్యాపారి వస్తువుల మీద తమ ప్రతాపం చూపించారు, మరి తయారు చేసే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నకు సమాధానం లేదు. సరే అది పక్కన పెడితే… సిగరెట్ విషయానికి వచ్చి చూద్దాం… ఈ సిగరెట్ వాడకం మెదడు మీద ప్రభావం చూపిస్తుంది దానికి పలువురు బానిసలుగా మారిపోతున్నారని ఆరోపిస్తూ కేంద్రం దాన్ని నిషేధించి పార్లమెంట్ లో బిల్లు ఆమోదించింది.

సరే అది ఆరోగ్యానికి హానికరమే… మరి సిగరెట్ ఆరోగ్యమా…? రోజు పెట్టెలు పెట్టెలు సిగరెట్లు తాగుతూ ఎందరో అనారోగ్యం పాలవుతున్నారు కదా వాటి మీద ధూమపానం క్యాన్సర్ కారకం అని బొమ్మలతో సహా రాసి ఉంటుంది కదా…? మరి దాన్ని ఎందుకు నిషేధించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు…? పొగాకు రైతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉంటారు… సరే ఈ సిగరెట్ తయారి దారులకు కూడా అన్యాయమే కదా మరి…? దానికి ఒక న్యాయం దీనికి ఒక న్యాయం ఉంటుందా…?

ఐఖ్య రాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రతీ ఏటా 8 మిలియన్ల మంది ధూమపానం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ సిగరెట్ ని కూడా బాన్ చేస్తే ప్రాణాలను కాపాడినట్టే కదా…? జుట్టు ఉన్న అమ్మ ఎన్ని ముళ్ళు అయినా వేయవచ్చు అన్నట్టు… నోరున్న ప్రభుత్వాలు పనికి రాని విషయాల్లో ఎన్నో వివరణలు ఇస్తూ ఉంటాయి… సిగరెట్ అనేది ఆరోగ్యానికి హాని కారకం… ఎందరో చిన్నారులు దాని కారణంగా చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఈ విషయం ప్రభుత్వానికి బాగా తెలుసు… లెక్కలతో సహా అధికారులు నివేదికలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు దృష్టి పెట్టి వాటిని అడ్డుకోవాలి, చిన్న పిల్లలను మద్యం జోలికి రానీయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి…ఈ సిగరెట్ ని నిషేధించడం తప్పు కాదు… కాని ఆరోగ్యానికి హాని కలిగించే ప్రతీ ఉత్పత్తని నిషేధించాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్లాస్టిక్ ని అరికట్టాలి అన్నప్పుడు ప్రజలకు వాటిని అందకుండా చెయ్యాలి గాని అందిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు… ఇలాంటి విషయాల మీద ప్రభుత్వాలు జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది…!

Read more RELATED
Recommended to you

Latest news