టీడీపీలో రెడ్డి: బాబు ప్లాన్ బాగున్నా ఒప్పుకోవడం లేదంట!

-

శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు నానా హడావిడి చేసి, గుంటూరు జీజీహెచ్ కి వెళ్లి పరామర్శించే పనికి పూనుకున్నారంటే అందులో అర్ధముంది. దానికి కారణం… అచ్చెన్న ను అరెస్టు చేసింది.. ఒక ఎమ్మెల్యేగానో లేక ఒక ప్రైవేటు కేసులోనో కాదు. గత ప్రభుత్వంలో మంత్రిగా అవినీతికి పాల్పడ్డారని! ఆ విషయంలో బాబు & చినబాబు స్పందించారంటే అర్ధముంది. కానీ… అక్రమాల కేసులో, పదుల సంఖ్యలో కేసులు నమోదయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ని అరెస్టు చేసినప్పుడు కూడా ఎందుకు హడావిడి చేశారు. కేవలం టీడీపీ నేత అనేనా లేక మరేదైనా కారణం ఉందా అంటే… “రెడ్డి” అనే కారణం ఉందని అంటున్నారు తమ్ముళ్లు.

రాజకీయాల్లో లోకేష్ ఏనాడు ఇప్పుడున్నంత యాక్టివ్ గా లేడనే చెప్పాలి. కారణాలు ఏమైనా కానీ కాస్త ఒల్లొంచుతున్నారని అంటున్నారు పార్టీ సీనియర్లు! ఆ సంగతులు అలా ఉంటే… జేసీ ప్రభాకర్ ని, జేసీ అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత లోకేష్ అనంతపురం వెళ్లి వాళ్ల కుటుంబాన్ని పరామర్శించాడు. ఆ సమయంలో అనంతపురంలోనే ఉన్న టీడీపీ నాయకులు మాజీ మంత్రులు ఎవరూ హాజరు కాలేదు. జేసీ ఫ్యామిలీ సంగతి కాసేపు పక్కనపెడితే… అధినేత కుమారుడు వచ్చాడన్న ప్రోటోకాల్ కూడా పాటించలేదు.. కనీస మర్యాదకైనా వచ్చి పలకరించలేదు. దానికి కారణం ఏమిటబ్బా అంటే… జేసీ ఫ్యామిలీకి బాబు, చినబాబులు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడమేనట!

జేసీ ఫ్యామిలీకి చంద్రబాబు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇచ్చినా అది మిగిలిన నేతలకు నచ్చడం లేదంట. ఇదే విషయాని బాబు దగ్గర నేరుగా ప్రస్థావించారు కూడా నంట. అయితే… వారి మీద ప్రత్యేకమైన ప్రేమేమీ కాదు.. మన పార్టీలో రెడ్లకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామన్న విషయం చెప్పుకోవడానికి అన్నట్లుగా బాబు సమాధానం ఇచ్చారంట. అయినా కూడా ఆ జిల్లా నేతలు ఏమాత్రం అంగీకరించలేదని, అలకపాన్లుపు దిగలేదని అంటున్నారు లోకల్ తమ్ముళ్లు. దాంతో ఇంక ఆ విషయం గురించి వీలైనంత తక్కువగా మాట్లాడాలని, తక్కువగా స్పందించాలని బాబు, చినబాబు నిర్ణయించుకున్నారని అంటున్నారు. నాటి నుంచే చినబాబు కూడా అవసరమైతే తప్ప అస్తమానం జేసీ అరెస్టు గురించి ప్రస్థావించడం లేదని అంటున్నారు. చంద్రబాబు అయితే అసలు ఆ పేరున కనీసం ట్వీట్ కూడా చేయడం లేదని అంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news