లారీలపై హార్న్ ఓకే ప్లీజ్ అని ఎందుకు రాస్తారు..? కారణం ఏంటో తెలుసా..?

-

మనం బయటకు వెళ్ళినప్పుడు లారీలను గమనించినట్లయితే లారీల వెనుక పెద్ద అక్షరాలతో హార్న్ ఓకే ప్లీజ్ అని రాసి ఉంటుంది. అయితే ఎందుకు ఇలా రాస్తారు..? దాని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. లారీలు, వ్యాన్లు వంటి పెద్ద వాహనాలపై ఇలాంటివి మనకి కనబడుతూ ఉంటాయి. పైగా పెద్ద ఫాంట్ వాడతారు. కలర్ ఫుల్ గా కూడా పెయింట్లు వేస్తారు. నంబర్ ప్లేట్ల కంటే వీటిపై ఎక్కువ ఫోకస్ పడేటట్టు పెద్ద అక్షరాలతో రకరకాల పెయింట్స్ ఉపయోగించి రాస్తూ ఉంటారు. హార్న్ ఓకే ప్లీజ్ అని ఎందుకు రాస్తారు..? దానికి అర్థం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఎవరైనా రోడ్డుపై వెళ్లేటప్పుడు ఓవర్ టేక్ చేస్తూ ఉంటారు. ముందుగా హార్న్ కొడతారు. దాంతో ముందు వెళ్లే వాళ్లకి వెనక ఒక బండి వస్తుంది అని అర్థమవుతుంది. ఓవర్ టేక్ చేయడానికి ఇలా హార్న్ కొడుతున్నారని అర్థమవుతుంది. సైడ్ కి నడిపి లారీ డ్రైవర్ సైడ్ ఇస్తాడు. ఇలా చేస్తే ఈజీగా ఓవర్ టేక్ చేయొచ్చు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి హార్న్ ప్లీజ్ అని రాస్తారు.

ఓకే అంటే హార్న్ కొట్టినా పర్లేదు అని అర్థం వచ్చే విధంగా ఓకే ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది వరకు అయితే సింగిల్ రోడ్లు మాత్రమే ఉండేవి. అలాంటప్పుడు చిన్న వాహనాలు నడిపేవారు. పెద్ద పెద్ద వాహనాలు వెనుక ఉంటే వెళ్లడానికి ఇబ్బంది అయ్యేది. పైగా అటు నుంచి ఏదైనా వాహనం వస్తుందా లేదా అనేది కూడా తెలియదు. అదే ఒకవేళ హారన్ కొడితే పక్కకు జరుగుతాయి. దానితో వెళ్లొచ్చు. హారన్ కొట్టిన తర్వాత ముందు వాహనం తెల్ల రంగు బల్బుని వెలిగించేది ఆ బల్బు వెలిగితే ఓవర్ టేక్ చేయొచ్చు అని అర్థం.

Read more RELATED
Recommended to you

Exit mobile version