AP: ‘అరబిందో’ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 108, 104 సర్వీసుల నుంచి వైదొలగనుందట ‘అరబిందో’ సంస్థ. ఏపీలో 108, 104 అంబులెన్స్‌ల నిర్వహణ నుంచి వైదొలగనుందట అరబిందో సంస్థ. ఈ సర్వీసుల పనితీరు బాగోలేదని ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం అందుతోంది. నిర్వహణ సరిగా లేదని నిఘా సంస్థలు చెప్పడంతో అరబిందోను తప్పించేందుకు సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం.
బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని అరబిందోకు స్పష్టం చేసిందట ప్రభుత్వం. 108, 104 నిర్వహణను ఏడేళ్ళ పాటు అరబిందోకు అప్పగిస్తూ 2020 జూలై 1న ఒప్పందం చేసుకుంది గత వైసీపీ ప్రభుత్వం. టెండర్లలో అరబిందో గ్రూప్ మాత్రమే ఎంపికయ్యేలా వ్యూహ రచన చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అరబిందో సంస్థలో కీలక వ్యక్తిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు ఉన్న సంగతి తెలిసిందే.