సాధారణంగా పక్షులు ఎక్కడుంటాయంటే.. చెట్ల మీద అని అంటారు. అయితే సిటీల్లో చెట్లు ఉండవు కదా మరి ఎక్కడుంటాయి అంటే ఇంకెక్కడా కరెంట్ తీగలపైనే అంటారు. ఏ పక్షి అయినా కరెంట్ తీగమీద నిలబడగలదు అనుకుంటాము. కానీ ఈ పక్షి మాత్రం కరెంట్ తీగపై ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకో తెలుసుకోండి.
మనకు తెలిసిన పక్షుల్లో పావురం కూడా ఒకటి. పావురాలను ఎప్పుడు చూసిన ఇంటి గోడలపైనో, కోటలుపైన, రోడ్లపై వాలడం చూస్తాం. గానీ కరెంట్ తీగపై వాలిన పావురాన్ని చూడడం మాత్రం అరుదు అని చెప్పవచ్చు. ఎందుకంటే.. పావురం సాధారణ పక్షిలాగా కరెంటు తీగలపై గానీ, చెట్లపై గానీ వాలదు.
దీనికి కారణ లేకపోలేదు. పావురాల కాళ్లు, ఇతర పక్షుల కాళ్లకి తేడా ఉంటుంది. అందుకనే అవి చెట్లపై, కరెంట్ తీగలపై వాలినా ఎక్కువసేపు ఉండేలేవు.అందుకే ఎక్కువగా జనవాసాల మధ్య అంటే ఇంటి గోడలు, బిల్డింగ్‌లపై ఎక్కువగా ఉంటాయట. ఇది చదివిన తర్వాత అనుమానం వస్తే మీ ఆఫీసుల్లో, ఇంటి దగ్గర ఉండే పావురాల గుంపును గమనించండి.