భర్తతో ఎంత మంచి బంధం వున్నా వీటిని అస్సలు భార్య చెప్పదు..!

-

భార్యా భర్తల మధ్య ఏమీ దాచ కూడదని.. అన్ని పంచుకోవాలని అంటూ ఉంటారు. కానీ నిజానికి భార్య కొన్ని విషయాలని భర్తతో అసలు చెప్పాడు. నిజానికి వాళ్ళ బంధం ఎంత బాగున్నా సరే ఈ విషయాలను ఏ భార్య కూడా తన భర్త తో అస్సలు చెప్పకూడదు అని అనుకుంటుంది. కానీ వాటిని భర్త అర్ధం చేసుకోవాలి. అయితే మరి భార్య అసలు భర్తతో చెప్పని విషయాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఇలా ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేద్దాం.

ప్రేమ గురించి చెప్పదు:

భర్త మీద ఉండే ప్రేమని చెప్పే స్త్రీలు చాలా తక్కువ మంది ఉంటారు. భార్య ఎప్పుడు కూడా ఇంత ప్రేమిస్తున్నాను అని తన ప్రేమను భర్త తో చెప్పదు. కనుక పురుషుడు దాన్ని గ్రహించి దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. కానీ ఆమె మాత్రం ఆ విషయం చెప్పదు.

అనారోగ్య సమస్యలు:

ఏమైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే భార్య భర్తతో చెప్పదు. ఎంత ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని పనిని పూర్తి చేస్తుంది. కాబట్టి భర్త ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.

డబ్బుల విషయం:

స్త్రీలు భర్త కి తెలియకుండా రహస్యంగా డబ్బులు దాస్తారు. అవసరానికి వుండే అంత డబ్బులు వాళ్ళు దాస్తూ ఉంటారు. ఈ విషయాన్ని కూడా అస్సలు భర్త తో చెప్పదు ఏ స్త్రీ కూడా.

విషాదం:

తనకు ఏదైనా బాధ కలిగినా ఆందోళన చెందిన భార్య భర్త కు చెప్పదు. వీలైనంత వరకూ ఆ బాధ తనలో తానే భరిస్తూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version