ఇదివరకు రోజుల్లో ఆడవాళ్లు లంగా వోణీలు, చీరలు వంటివి వేసుకునే వారు కానీ రాను రాను పాత పద్ధతులు పోతున్నాయి. చీరలతో ఫ్రీగా ఉండలేమని చాలామంది డ్రెస్సులు వేసుకోవడం లేదంటే నైటీలు వేసుకోవడం చేస్తున్నారు. నిజానికి రాత్రి పూట వేసుకునేది కాబట్టి దానిని నైటీ అన్నారు కానీ ఉదయం పూట కూడా చాలా మంది నైటీలు వేసుకుంటూ ఉంటారు నైటీలు వేసుకుంటే ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుందని భావిస్తారు. అయితే నైటీ వేసుకోవడం వలన ఈ రోజుల్లో ఆడవాళ్ళని చులకనగా చూస్తున్నారు. హేళన చేస్తున్నారు.
ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు. అలానే వస్త్రధారణ కూడా బాగుండాలి. నైటీలు వేసుకోవడం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి. రోజు రోజుకి వస్త్రధారణలో మార్పు వస్తోంది ఇదివరకు కేవలం చీరలు మాత్రమే అందరూ కట్టుకునేవారు అయితే చీరలు వేసుకోవడం వలన ఏమవుతుంది అంటే చీరలు టైట్ గా ఉంటాయి.
కొన్ని శరీర భాగాలని బిగ పెట్టి ఉంచుతాయి అలా ఉంచడం వలన కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది అందుకే ఇదివరకు రోజుల్లో వస్త్రధారణ అలా ఉండేది కానీ ఈ రోజుల్లో నైటీ వేసుకుంటున్నారు. దీంతో కొవ్వు చాలా ప్రాంతాల్లో పెరిగిపోతోంది. చీర కట్టుకునే ఆడవాళ్ళ ఆకృతి చాలా బాగుంటుంది నైటీలు వంటివి వేసుకోవడం వలన శరీరాకృతి బాగా మారిపోతుంది కాబట్టి ఒకసారి నైటీలు వేసుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది.