ఇదిగో ఇది విన్నారా..అక్కడ వర్క్ మొత్తం పబ్ లోనే..

-

కరోనా మొదలైనప్పటి నుంచి ఉద్యోగులు మొత్తం ఇంట్లోనే కుర్చొని వర్క చేస్తున్న సంగతి తెలిసిందే..అంతకు ముందు కూడా ఈ వర్క్ కల్చర్ ఉన్నప్పటికీ…పెద్దగా వినియోగించుకుంది లేదు. అందరూ తప్పకుండా ఆఫీస్‌లకు వెళ్లే పనులు చేయాల్సి వచ్చేది. ఎప్పుడైతే కరోనా భయం మొదలైందో అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మళ్లాయి ఐటీ సంస్థలు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ఇదే విధంగా పని చేసుకున్నారు ఉద్యోగులు. చెప్పాలంటే…WFHకి వాళ్లు బాగా అలవాటు పడిపోయారు. ఈ మధ్యే కొన్ని సంస్థలు ఆఫీస్‌లకు వచ్చేయండి అంటూ ఉద్యోగులకు కబురు పంపుతున్నాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

కానీ…కొందరు ఉద్యోగులు వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. అవసరమైతే…వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే కంపెనీకి మారిపోతాం కానీ…ఆఫీస్‌కు మాత్రం వచ్చేది లేదని కాస్త గట్టిగానే చెబుతున్నారు. ఈ గొడవ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుండగానే…ఇప్పుడు కొత్త వర్క్ కల్చర్ వచ్చేసింది. సింపుల్‌గా బార్‌లో కూర్చుని ఆఫీస్ పని చేసుకోవచ్చు..ఏమిటి బార్ లో ఎలా సాధ్యం అనుకుంటున్నారా.?మీరు విన్నది అక్షరాల నిజం..ఈ కల్చర్ అనేది యూకే ఉంది..అలా స్టార్ట్ చేశారో లేదో..వెంటనే వైరల్ అయిపోయిందీ పని విధానం. ఎంతగా అంటే…అందరూ పబ్‌లో కూర్చుని పని చేసేందుకే ఇష్టపడుతున్నారు. నిజానికి..ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొందరు ఉద్యోగులు రెస్టారెంట్‌లు, బార్స్‌, కాఫీ షాప్‌లలో కూర్చుని ఎంచక్కా ఆఫీస్ పని చేసుకుంటున్నారు. ఇప్పుడు పబ్‌లోనూ కూర్చుని ప్రశాంతంగా పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి కొన్ని కంపెనీలు..

కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఆఫీస్‌లు పెట్టుకుని భారీగా ఖర్చు పెట్టే బదులు..ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ పబ్ ఇచ్చేస్తే బెటర్ అని నిర్ణయించుకున్నాయి. అటు పని జరిగిపోతోంది. ఇటు నిర్వహణ ఖర్చు కూడా తగ్గిపోతోంది. కొన్ని పబ్‌లు ఈ ఎంప్లాయిస్‌ కోసం స్పెషల్ డిస్కౌంట్‌లు కూడా ఇస్తున్నాయి. ఒక్క రోజుకి 11 డాలర్లు చెల్లిస్తే…లంచ్‌తో పాటు నచ్చిన డ్రింక్ కూడా తాగొచ్చు. ఇంకొన్ని 17 డాలర్ల వరకూ వసూలు చేస్తున్నాయి. ఇక టీ, కాఫీ అలవాటు ఉన్న వారికైతే అన్‌లిమిటెడ్‌గా అందించేస్తున్నాయి పబ్‌లు. క్లైంట్స్‌ కోసం ఎదురు చూస్తూ…ఇలా డిస్కౌంట్‌లతో గాలం వేస్తున్నాయి. ప్రమోషన్‌తో పాటు బిజినెస్‌ కూడా ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్ వాసులు చాలా తక్కువగా ఖర్చు చేసేందుకే ఇష్టపడుతున్నారు…ఈ విధానం బాగానే ఉండటంతో ప్రతి ఒక్కరూ ఈ విధంగా తమ ఉద్యోగులకు ఇవ్వాలని భావిస్తున్నారు..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version