World Senior Citizen’s Day 2021: కాస్త సమయాన్ని పెద్దవాళ్ళతో ఇలా గడపండి..!

-

మన ఇళ్లల్లో పెద్ద వాళ్ళు ఉంటారు. మంచి, చెడు చెప్పడానికి…. విలువలని నేర్పడానికి… కష్టాలలో మంచి బాట చూపడానికి… ఇలా ఎన్నో విధాలుగా మనకి సహాయపడతారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో పెద్దవాళ్ళని చూడడం లేదు. పిల్లలు సైతం పెద్ద వాళ్ల దగ్గరికి వెళ్లడం లేదు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. పెద్ద వాళ్లను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకోవాలి. వాళ్లతో కాస్త సమయాన్ని వెచ్చించి ప్రేమను పంచుకోవాలి. వాళ్లు ఏ బాధా లేకుండా హాయిగా ఉండే బాధ్యత ఇంట్లో ఉన్న పిల్లలది.

వాళ్ళతో మాట్లాడడం.. వాళ్ళ రోజులో ముఖ్యమైన విషయాలను పంచుకోవడం అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెద్దవాళ్ళతో సమయాన్ని వెచ్చించినమని చెప్తూ ఉండాలి. అలానే వాళ్ల కష్టాలనీ బాధలనీ కూడా వినాలి. అయితే ఈ విధంగా కనుక మీరు మీ యొక్క సమయాన్ని వెచ్చిస్తే సరిపోతుంది.

మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో కానీ మీకు దగ్గరలో ఉండే పెద్ద వాళ్లతో కానీ సాయంత్రం పూట టీ స్నాక్స్ తీసుకుని కాసేపు వాళ్ళతో కూర్చోండి. వాళ్ళని ఆనందంగా ఉంచి ఆ సమయంలో వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందండి.
అదే విధంగా మీరు ఏదో ఒక రోజు వాళ్ళకి నచ్చిన ఆహారాన్ని వండి వాళ్లతో పాటు కూర్చుని భోజనం చేయండి. మీకు ఎప్పుడైతే సెలవలు ఉంటాయో అప్పుడు మీరు దీనిని ప్లాన్ చేసుకోవచ్చు.
వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ వాళ్లకి ఇస్తే ఎంతో ఆనంద పడతారు. అది చిన్నదైనా సరే వాళ్ళు ఎంతో ప్రేమగా స్వీకరిస్తారు.
లేదా మీరు కుటుంబమంతా కలిసి తీసుకున్న పాత ఫోటోలు అన్ని వాళ్ళకి తీసుకెళ్లి చూపించండి. ఆ రోజులు కోసం వాళ్ళ మాట్లాడితే వాళ్లు ఎంత ఎలా మురిసిపోతున్నారో చూడండి.
అదే విధంగా మీరు కావాలంటే వాళ్ళతో చిన్న చిన్న ఆటలు ఆడవచ్చు. లూడో, క్యారమ్స్ వంటి వాటిని తీసుకెళ్ళి.. వాళ్లదగ్గర కూర్చుని ఆడండి. ఇలా అప్పుడప్పుడూ వాళ్ళతో కాస్త సమయాన్ని గడిపితే వాళ్ళు ప్రతి రోజు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.

అంతే కానీ మీ స్వార్థం కోసం చూసుకుని ఎంతసేపు మీరు సమయం వెనకాల పరిగెడుతూ ఉంటే వాళ్ళు నిరంతరం బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ మాత్రం బాధ పడకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు వాళ్ళతో కాసేపు గడపండి. దీనితో వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలరు.

Read more RELATED
Recommended to you

Latest news