ప్రపంచవ్యాప్తంగా తేనె భిన్న రకాలుగా అందరికీ అందుబాటులో ఉంటుంది. నాణ్యతను బట్టి దాని ధర మారుతుంది. కానీ ఏ తేనె అయినా సరే దాదాపుగా రుచి ఒక్కలాగే ఉంటుంది. అందులో ఉండే ఔషధ విలువలు కూడా ఒక్కలాగే ఉంటాయి. అయితే టర్కీకి చెందిన ఓ కంపెనీ మాత్రం భిన్న రకానికి చెందిన తేనెను ఉత్పత్తి చేసింది. అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేనెగా కూడా పేరుగాంచింది.
ఓ టర్కీ కంపెనీ ఓ గుహలో తేనెను ఉత్పత్తి చేసింది. ఆ గుహ సముద్ర మట్టానికి సుమారుగా 2500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. తేనెటీగలు, మనుషులు నివాసం ఉండే ప్రాంతాలకు దూరంగా ఎక్కడో మారుమూల గుహలో ఆ తేనెను ఉత్పత్తి అయ్యేలా చేశారు. ఈ క్రమంలో ఆ తేనె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేనెగా గుర్తింపు పొందింది. దాని ధర కేజీకి రూ.8.80 లక్షలు. అవును.. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ధ్రువీకరించి తమ రికార్డుల్లో ఈ తేనెకు చోటు కల్పించారు.
అయితే ఈ తేనె ఖరీదైంది అయినప్పటికీ ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇది ఉత్పత్తి అవుతుంది. అలాగే సాంప్రదాయ తేనె రుచికి భిన్నంగా దీని రుచి ఉంటుంది. అత్యంత చేదుగా దీని రుచి ఉంటుంది. కానీ అనేక ఔషధ విలువలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ తేనెకు చెందిన వివరాలను ఆ కంపెనీ ఓ వీడియోలో తెలియజేసింది. ఈ క్రమంలో ఈ తేనె గురించి అందరూ ఆసక్తిగా వివరాలను తెలుసుకుంటున్నారు.