అనంతపురం జిల్లాలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో చివరి వరకు ఉత్కంట కొనసాగగా… చివరికి జేసి కుటుంబం పంతం నెగ్గించుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఈరోజు మున్సిపల్ చైర్మన్ కావడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెల్ప్ చేశాడు అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ అనుకుని ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మున్సిపల్ చైర్మన్ గా కూర్చుని పరిస్థితి లేదు అని ఆయన పేర్కొన్నారు.
తాడిపత్రిని అభివృద్ధి చేసేందుకు నిధుల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు మంత్రి బొత్స ఇతర నేతలు కూడా కలుస్తా అని ఆయన వెల్లడించారు. ఎంపీ తలారి రంగయ్య ఎమ్మెల్యే పెద్దారెడ్డి కి లేఖలు కూడా రాస్తాను అని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి…ఆయన్ని కలవడం లో తప్పులేదు రాజకీయం వైరం వేరు అని ఆయన పేర్కొనారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే తప్పేముంది.. ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి బాస్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నే నన్ను పొగిడాడు…అతను హెల్ప్ చేస్తాడు అని చెప్పుకొచ్చారు. పోలీసులు పంచాయతీ… మున్సిపల్ ఎన్నికల్లో సహకరించారు అని ఆయన హాట్ కామెంట్స్ చేసారు.