మహాభారతంలోని పాత్రలను అర్థం చేసుకుంటే.. లైఫ్ లో ఎలా ఉండకూడదో తెలుస్తుంది..!

-

మహాభారతం ద్వారా మనం అనేక విషయాలను తెలుసుకోవచ్చు. మహాభారతం ద్వారా ఎలాంటి పనులు చేయొచ్చు..? ఎలాంటి పనులు చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది. మహాభారతం కేవలం అన్నదమ్ముల యుద్ధం కాదు. ఎవరైనా మహాభారతాన్ని అర్థం చేసుకుంటే… ఏ వ్యక్తి అయినా జీవితాంతం కష్టసుఖాల్ని దాటుకుని ముందుకు వెళ్లడానికి అవుతుంది. మహాభారతంలో లేనిది ఏదీ కూడా ప్రపంచంలో లేదు. మహాభారతంలో మనం మోసం, న్యాయం, ధర్మం, స్నేహం, వెన్నుపోటు ఇలా చాలా చూసాము. జీవితం నేర్పే పాఠాన్ని మహాభారత గ్రంధం మనకి నేర్పిస్తుంది. మహాభారతాన్ని చదివితే.. అందులో ప్రతి పార్ట్ ని అర్థం చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. దానిని తట్టుకునే శక్తి సామర్థ్యం కూడా వస్తాయి.

అర్జునుడిని చూసుకున్నట్లయితే జీవితంలో ఎప్పుడూ నిత్య విద్యార్థిగా ఉండాలి అని చెప్పారు. అర్జునుడు తన జీవితాంతం ఏదో ఒక విద్యని నేర్చుకుంటూనే ఉన్నారు. అలాగే ఎప్పుడు నేర్చుకోవడానికి ఆయన సిగ్గు పడలేదు. ఏ ఆస్త్రాలు ఎవరి దగ్గర ఉన్నాయనేది తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గర శిష్యరికం చేసి ఆయుధాలని పొందారు. ఇక అభిమన్యుడు గురించి చూస్తే.. అభిమన్యుడు ఏ విషయాన్నయినా పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యమని నిరూపించారు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే ఆయనకే తెలుసు. ఆ పద్మవ్యూహం నుంచి బయటకు రావడం తెలియక చనిపోయారు.

అర్ధ జ్ఞానంతో అతి నమ్మకంతో ఏ పని చేయకూడదని తెలిపారు. ధృతరాష్ట్రుడికి బిడ్డల మీద ఎక్కువ ప్రేమ ఉండడం అతి ప్రేమ వారి నాశనానికే దారి తీయడం మనం చూసాం. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు మహాభారతంలో నిరూపించారు. అతనికి ఉన్న అతి ప్రేమ కారణంగా బిడ్డల్ని చెడ్డవారిగా మార్చేసింది. కర్ణుడు ఎక్కువ మంచితనం, ఎక్కువ జాలి, ఎక్కువ దయ ఉంటే జీవితాన్నే కాల్చేస్తాయని చెప్పారు. అతి మంచితనంతో దానధర్మాలతో జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కర్ణుడు చివరికి చెడు వైపు వెళ్లి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. జీవితంలో గెలిచి నిలవాలంటే మంచి వాళ్లతో స్నేహం చేయాలని.. అనవసరమైన వ్యక్తులకి అనవసరమైన పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా దానాలు చేయకూడదు అనేది చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version