ఇంట్లోనే లిప్ స్టిక్ తయారుచేయచ్చు.. ఎలా అంటే?

-

అమ్మాయిలు అందంగా కనిపించడానికి వాడే ఎన్నో రకాల మేకప్ వస్తువులలో లిప్ స్టిక్ ఎంతో ముఖ్యమైనది. ఎంత మేకప్ వేసుకున్న కూడా లిప్ స్టిక్ లేకపోతే అందమే లేదు. అందుకే వీటిని హ్యాండ్ బ్యాగ్ లో కూడా క్యారీ చేస్తూ ఉంటారు కొందరు మహిళలు. అయితే వీటిలో వివిధ రకాల కలర్స్, షేడ్స్ ఎన్నెన్నో కొంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి, లిప్ స్టిక్ విరిగి పోతుంటాయి. విరిగిపోయిన ప్రతిసారి కొత్తది కొనాలంటే కుదరదు కాబట్టి, ఇంట్లోనే లిప్ స్టిక్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

 

సాధారణంగా లిప్ స్టిక్ కొన్నాక ఎక్కువ రోజులు వాడకపోతే విరిగి పోతాయి. మరి విరిగిపోయిన ముక్కలను తీసుకు కొద్దిగా షియా బట్టర్, ఇది మనకు మార్కెట్లో విరివిగా లభిస్తుంది. మైక్రోవేవ్, లిప్ స్టిక్ ను వేసేందుకు ఒక చిన్న కంటైనర్ ఇవి ఉంటే ఇంట్లోనే చాలా సులభంగా లిప్ స్టిక్ ను తయారు చేసుకోవచ్చు.

విరిగిపోయిన లిప్ స్టిక్ ముక్కలను ఇంకా లోపల ఉన్న దానిని బయటకు తీసి ఒక బౌల్ లోకి వేయాలి. అందులో కొద్దిగా షియా బట్టర్, వేసి మెత్తగా మిశ్రమంలా తయారుచేయాలి. ఈ రెండింటినీ కలిపి మైక్రోవేవ్ లో పది సెకన్ల పాటు వేడి చేయాలి. తరువాత బయటకు తీసి స్పూన్ సహాయంతో ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి.

గది ఉష్ణోగ్రత వద్ద మిశ్రమాన్ని ఉంచితే కొద్ది సమయానికి ఆ మిశ్రమం గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాత లిప్ స్టిక్ కంటైనర్ లో వేసుకొని తిరిగి కొత్త దానిలా వాడుకోవచ్చు. అంతే కాకుండా మనకు నచ్చిన రెండు మూడు రకాల షేడ్స్ ని వేసుకొని ఒక కొత్త రకం లిప్ స్టిక్ ని తయారు చేసుకోవచ్చు. చూశారు కదా ఇంట్లోనే లిప్ స్టిక్ తయారు చేయడం ఎంత సులభమో. ఇంకేందుకు ఆలస్యం ఇప్పటినుంచి మీ విరిగిపోయిన లిప్ స్టిక్ ను ఇంట్లోనే తయారు చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news