ఏపీలోని రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరులోని జంగాల కాలనీలో సోమవారం తెల్ల వారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 61 పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఒక ఇంట్లో మంటల వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా సర్వం కోల్పోయిన బాధితులు కట్టుబట్టలు మిగిలాయన్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు.