అగ్రిగోల్డ్ బాధితులకు భాజపా అండగా ఉంటుందని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వివరించారు. విజయవాడలో జరిగే నిరాహార దీక్షను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కుంభకోణంలో ఆ సంస్థ యాజమాన్యాన్ని రక్షించేందుకు రూ.వందల కోట్ల ఆస్తులను చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ సహా తెదేపా నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.