అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ విక్రయం.. హైదరాబాద్‌లో కలకలం, విద్యార్థి అరెస్ట్

-

కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం కాబోతున్న తరుణంలో హైదరాబాదులో పలుచోట్ల భారీగా డ్రగ్స్ పట్టివేత జరుగుతుంది. ఢిల్లీ , పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాదులో అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విద్యార్థిని సూరి లీల నవీన్ గా పోలీసులు గుర్తించారు. అతనితోపాటు వీర సాయి తేజను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నవీన్ పంజాబ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. గత నాలుగు సంవత్సరాల నుంచి నవీన్ కొత్త సంవత్సరం వేడుకలలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన నవీన్ పెద్ద మొత్తంలో డబ్బులు పలు యాప్ లలో తీసుకున్నారు. ఈ అప్పులను తీర్చడానికి అడ్డదారులను ఎన్నుకున్నాడు.

అటు నగరంలోని జూబ్లీహిల్స్ ,ఎల్బీనగర్ ఏరియాలలో కూడా పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 15 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 7 లక్షల విలువ చేసే 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, బ్రౌన్ షుగర్, కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news