ఇండోనేషియాలో విమాన ప్రమాదం …189 మంది జల సమాధి

-

ఇండోనేషియాలోని జావా ద్వీపానికి సమీపంలో సోమవారం విమానం సముద్రంలో కూలిపోయింది. రాజధాని జకార్తా నుండి బయలుదేరిన లయన్‌ ఎయిర్‌ విమానం 13నిమిషాలకే  ప్రమాదానికి గురవ్వడంతో మొత్తం 189మంది జల సమాధి అయివుంటారని సమాచారం. విమానం కూలిపోయిందని ఇండోనేషియా సహాయక బృందం ప్రతినిధి యూసుఫ్‌ లతీఫ్‌ నిర్ధారించారు. విమానానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ అధికారులతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతానికి సమీపంలోనే శిధిలాలను కనుగొన్నారు. ఉదయం 6.20గంటలకు బయలుదేరిన విమానం 7.20గంటలకు బాంగ్కా-బెల్టింగ్‌ టిన్‌ మైనింగ్‌ రీజియన్‌ రాజధాని పాంగ్‌కల్‌ సినాంగ్‌ సిటీలో దిగాలి వుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగే సమయానికి 5వేల అడుగుల ఎత్తులో వున్న విమానం ఒక్కసారిగా కిందకు దిగిందని, తర్వాత మళ్లీ ఎత్తుకు ఎగిరినా ఒక్కసారిగా కిందకు దిగిపోయి, చివరగా సముద్రంలో పడిపోయిందని తెలిపారు.  భారతీయ పైలట్‌ భవే సునేజా (31) ఎయిర్‌లైన్‌,  కో పైలట్‌ హర్వినో మరో ఆరుగురు కేబిన్‌ సిబ్బంది వున్నారు. పైలట్‌కు 6వేల గంటలు, కో పైలట్‌కు 5వేల గంటలు విమానాన్ని నడిపిన అనుభవం వుంది.

Read more RELATED
Recommended to you

Latest news