మీటూ.. టాలీవుడ్ హీరోని వణికిస్తున్న ఆమె..!

-

బాలీవుడ్ నుండి చిన్నగా సౌత్ సిని పరిశ్రమకు పాకిన మీటూ ఉద్యమంలో ఇప్పుడిప్పుడే తారాలు తమ కెరియర్ లో జరిగిన లైంగిక వేధింపుల గురించి నోరు విప్పుతున్నారు. కోలీవుడ్, శాండల్ వుడ్ లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ మీద కన్నడ నటి శృతి హరిహరణ్ చేస్తున్న వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. అర్జున్ తనని షూటింగ్ లో వేధింపులకు గురి చేశాడని ఈ విషయంలో తాను అసలు వెనక్కి తగ్గేది లేదని స్టేట్మెంట్స్ ఇస్తుంది శృటి.

ఇదిలాఉంటే టాలీవుడ్ లో మీటూ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. ఇక్కడ స్టార్స్ అందరు శ్రీరామ చంద్రులేనా అంటే కాదు కాని మీటూ వివాదం తెలుగు పరిశ్రమ దాకా రాకుండా పెద్ద శక్తులే అడ్డుకుంటున్నాయట. ఈ క్రమంలోనే ఓ బడా హీరో వల్ల లైంగికంగా వేధింపబడిన ఓ హీరోయిన్ అతని పేరు బయటపెట్టాలని చూస్తుందట.

హీరోకి ఫోన్ చేసి బెదిరించడంతో అతను ఆమెతో రాజీ కుదుర్చుకునే పనిలో ఉన్నాడట. సినిమా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ఆ హీరో ఆమెని మేనేజ్ చేసేలా ఢీల్ సెట్ చేసుకుంటున్నాడట. మరి ఆ హీరోయిన్ ఎవరు.. సదరు హీరో గారి వ్యవహారం ఎన్నాళ్లు దాగుతుంది అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news