ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రజాకూటమి

-

‘పీపుల్స్‌ ఫ్రంట్‌ ఉద్యమ ఆకాంక్షల ఎజెండా’ గా నామకరణం

ప్రజా కూటమి తన ఉమ్మడి మేనిఫెస్టో హైదరాబాద్ గోల్కోండ హోటల్ లో వేదికగా నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎల్‌ రమణ, కోదండరాం, పల్లా వెంకట్‌ రెడ్డిలు సంయుక్తంగా విడుదల చేశారు. ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ (సీఎంపీ) పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా హామీల వర్షం కురింపిచారు. మొత్తం 8 పేజీలతో ఆకుపచ్చ రంగులో ముద్రించిన ఈ పుస్తకానికి ‘పీపుల్స్‌ ఫ్రంట్‌ ఉద్యమ ఆకాంక్షల ఎజెండా’ అనే శీర్షిక పెట్టారు. ఈ సందర్భంగా కూటమి చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ… జవాబుదారీతనంతో ప్రజాకూటమి హామీలను అమలు చేయడంతో పాటు ప్రజలు కోరుకునే పారదర్శక పాలన  అందించనుందని ధీమా వ్యక్తం చేశారు.

కూటమిలో కొన్ని ముఖ్యాంశాలు..

ఒకేసారి ఒక్కో రైతుకు రూ.2 లక్షల పంటరుణం మాఫీ

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ.

ఎంప్లాయి మెంట్ క్యాలేండర్ను రూపొందించి ..ఉద్యోగాలను క్రమం తప్పకుండా భర్తీ చేయడం.

పింఛను వయో పరిమితిని 60 నుంచి 58 ఏళ్లకు తగ్గించడం.
తెలంగాణ భాషా వికాసానికి, చారిత్రక కట్టడాలకు ప్రాధాన్యం ఇస్తామని కోదండరామ్ తెలిపారు.

100 యూనిట్ల లోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి  తీసుకురావడం. వీటితో పాటు బడగు,బలహీన వర్గాల వారికి మేలు చేకూరేలా అనేక హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. అయితే ఇవి ఆచరణ సాధ్యం అవుతాయా అంటూ అప్పుడే సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు మొదలైయ్యాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version