రన్ మెషీన్ కింగ్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన ఘనత సాధించాడు. 2023 సంవత్సరంకి గాను విరాట్ ‘ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం ఇండియా క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. కోహ్లీ.. 2012, 2017, 2018లలో కూడా ఈ అవార్డును సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. తద్వారా కోహ్లీ.. ప్రపంచ క్రికెట్లో 4 సార్లు ఈ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
గతే ఏడాది 24 ఇన్నింగ్స్‌లలో ఆరు సెంచరీలు , ఎనిమిది అర్ధ సెంచరీలు నమోదు చేస్తూ 72.47 సగటుతో 1377 పరుగులతో సంవత్సరాన్ని ముగించాడు. గతే ఏడాది జరిగిన ప్రపంచకప్‌లో 11 ఇన్నింగ్స్‌లలో 765 పరుగులతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు, ఇది పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఒక వ్యక్తిగత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోర్, దీంతో 2003లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డు దాటేశాడు.