క్లీంకార’ తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. బెంగళూరుకి బయలుదేరిన రామ్ చరణ్, ఉపాసన

-

sankranti Celebrations : ‘సంక్రాంతి’ పండగ పేరు చెబితే చాలు.. ఆ పండుగ ఎప్పుడు వస్తుంది…ఎప్పుడు సొంత ఊళ్లకు వెళ్దాం అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తినీ చూపిస్తుంటారు. ఈ పండగకు సాధారణ ప్రజలే కాకుండా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వాళ్ళ సొంత ఊళ్లకు వెళ్తూ ఉంటారు.

మెగా ఫ్యామిలీ ఈ సంవత్సరం హైదరాబాదులో కాకుండా బెంగళూరులో ని ఫామ్ హౌస్ లో ఈ వేడుకలు జ‌రుపుకోనుంది . సంక్రాంతి పండగకు ఇప్ప‌టికే మెగా కుటుంబం మొత్తం బెంగళూరుకు పయనంకాగా.. తాజాగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు హీరో రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారా తో బెంగళూరుకి పయనమయ్యారు. క్లీంకారా జన్మించిన తర్వాత మొద‌టి సంక్రాంతి కావడంతో ఈ పండుగ‌ను గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకోనున్నారు. అలాగే వారితో పవన్ కొడుకు అకీరా నందన్ , కూతురు ఆద్య కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version