పురందేశ్వరి తో నాదెండ్ల మనోహర్ ….భేటీ అందుకేనా ?

-

రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నేతల కసరత్తు కొనసాగుతుంది.జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ బిజెపి చీఫ్ పురందేశ్వరితో భేటీ అయ్యారు. పొత్తులపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్ది సేపటికే దగ్గుపాటి పురందేశ్వరి-నాదెండ్ల భేటీ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పురందేశ్వరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బీజేపీ జనసేన మధ్య కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈ భేటీపై దగ్గుపాటి పురందేశ్వరి స్పష్టత ఇచ్చారు. జనసేన మా మిత్ర పక్షమేనని, నాదెండ్లతో భేటీ మర్యాద పూర్వకమే అని పురందేశ్వరి తెలిపారు. శివప్రకాష్ జీని కలవడానికే నాదెండ్ల మనోహర్ వచ్చారని ఆమె తెలిపారు. షర్మిల ఏ పార్టీలో చేరిన మాకు అవసరం లేదని …. మా పార్టీ బలోపేతం కోసం మేము పని చేస్తామని ఆమె వెల్లడించారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించామని , అంతేకాకుండా పొత్తులపై మా అభిప్రాయాలను బిజెపి అధిష్టానానికి వివరిస్తామన్నారు. పొత్తులపై తుది నిర్ణయం మా అధిష్టానానిదేనని పురందేశ్వరి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news