ఫిలింఫేర్ నామినేషన్లో యానిమల్ హవా.. ఏకంగా 19 కేటగిరీల్లో

-

69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు వేడుకకు సంబంధించిన నామినేషన్ జాబితాను ప్రకటించారు. ఈసారి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లలోనూ దూకుడు కొనసాగించింది. ఏకంగా 19 విభాగాల్లో నామినేట్ అయింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ పఠాన్ ‘ 15 విభాగాల్లో నామినేట్ అయింది. ఇక విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ’12th ఫెయిల్’ 7 కేటగిరీల్లో , ‘టైగర్ 3’ 2 కేటగిరీల్లో నామినేట్ అయింది.

గతేడాది రిలీజైన యానిమల్ మూవీ ఏకంగా రూ.900 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రణ్‌బీర్, రష్మిక నటించారు. మరోవైపు ఈసారి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో షారుక్ ఖాన్..డంకీ, జవాన్ మూవీస్ కోసం నామినేట్ అయ్యాడు.

 

ఉత్తమ చిత్రం (నామినేషన్)

 

జవాన్

OMG 2

పఠాన్

12వ ఫెయిల్

యానిమల్

 

 

 

మెయిన్ మేల్ లీడ్ (నామినేషన్)

 

షారుక్ ఖాన్ (డింకీ)

రణబీర్ కపూర్ (యానిమల్)

షారుక్ ఖాన్ (జవాన్)

రణవీర్ సింగ్

సన్నీ డియోల్ (గదర్ 2)

విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)

 

ఉత్తమ నటి ప్రధాన పాత్ర (నామినేషన్)

 

రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ Vs నార్వే)

భూమి పెడ్నేకర్

అలియా భట్

దీపికా పదుకొనే (పఠాన్)

కియారా అద్వానీ (సత్యప్రేమ్ కి కథ)

తాప్సీ పన్ను (డింకీ)

 

ఉత్తమ దర్శకుడు (నామినేషన్లు)

 

అట్లీ (జవాన్)

అమిత్ రాయ్ (OMG 2)

సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్)

కరణ్ జోహార్

విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)

సందీప్ రెడ్డి వంగా (యానిమల్)

Read more RELATED
Recommended to you

Exit mobile version