ప్రజాకూటమి ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఇక్కడి నేతలకు విలువ లేకపోవడంతో ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని, అమరావతి నుంచి చంద్రబాబును రప్పించారని ఎద్దేవా చేశారు. గురువారం ఇచ్చిన పేపరు ప్రకటనల్లో బాబు ఫొటోలను తొలగించింది. ప్రగతిపథంలో సాగుతున్న తెలంగాణకు ఎన్నికల ఫలితాలు గొప్ప స్ఫూర్తినిస్తాయని గుర్తు చేశారు. పోలీంగ్ జరిగే రోజు వ్యూహాత్మకంగా వ్యహరిస్తే విజయం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.
తెరాస అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు గెలుపు దిశగా దిశానిర్దేశం చేశారు. గురువారం తన నివాసం నుంచి అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడుతూ…వారికి అనేక సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెరాస మరోసారి సత్తా చాటనుందని అభ్యర్థులకు వివరించినట్లు తెలుస్తోంది. అనుకున్న స్థానాల కంటే ఎక్కువగానే గెలవనున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో ఎన్నికల సరళి గురించి, పోలింగు రోజున అనుసరించాల్సిన వ్యూహాన్ని వారికి నిశితంగా వివరించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ప్రణాళికలో లేని వాటిని కూడా ప్రకటించి అమలు చేయడంపై ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా ఓటమికి భయపడి వారి నియోజకవర్గాలను దాటి బయటికి రావడం లేదన్నారు. చంద్రబాబుతో కాంగ్రెస్ నేతల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.