రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి వివరాలను కేంద్రం శనివారం సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందచేసింది. ఈ నెల 29లోగా వివరాలను అందచేయాలంటూ ఈ నెల 10న కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో 29న దీనిపై విచారణ జరగనుంది. కాగా యుపిఎ, ఎన్‌డిఎ హయాముల్లో విమానాల ధరల వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించాల్సిందిగా రాఫెల్ ఒప్పందంపై మొదటి పిటిషన్ దాఖలు చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి వివేక్ ధండా కోరారు. విమానాల తయారీ సంస్థ దాసాల్డ్ ఏవియేషన్ అనీల్ అంబానీ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్టు వివరాలను కూడా ఆయన కోరారు. దేశ వ్యాప్తంగా రాఫెల్ యుద్ధ విమానాల పై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.