‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటున్న ఏపీ

-

దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ దూకుడు పెంచింది. అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు వైసీపీ సోమవారం నుంచి ‘రావాలి జగన్ … కావాలి జగన్ ’ అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా  ప్రతీ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టింది. ప్రతీ రోజు కనీసం రెండు పోలింగ్ బూత్ ల పరిధిలో ఓటర్ల ఇంటింటికి వెళ్లి వైసీపీ నవరత్నాలు గురించి అవగాహన, తెదేపా అవినీతి కార్యక్రమాల గురించి వివరించనున్నారు. పార్టీ సమన్వకర్తలు, నేతలు, కార్యకర్తలు సమన్వయంతో నియోజకవర్గ ప్రజలతో మమేకం కానున్నారు. దీంతో బూత్ స్థాయి కార్యకర్త నుంచి నియోజకవర్గ ఇన్ చార్జ్ వరకు ‘రావాలి జగన్.. కావాలి జగన్ నినాదంతో ముందుకు సాగనున్నారు.

బూత్ కమిటీల్లో అవసరమైన చోట వారం రోజుల్లోగా నియామకాలు జరపాలని వైసీపీ అధినేత పార్టీ నేతలకు సూచించారు. బూల్ కమిటీల పనితీరుని పరిశీలించేందుకు మండల, జిల్లా, రీజినల్ స్థాయిలో ప్రత్యేక బృందాల‌ను నియమించారు.  ఏపీలో నేటి నుంచి  ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదం హోరెత్తుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version