అల్లుడు జోరు బాగానే ఉంది

-

మారుతి డైరక్షన్ లో అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు గురువారం రిలీజ్ అయ్యింది. వినాయక చవితి సందర్భంగా రిలీజైన ఈ సినిమా వీకెండ్ కలక్షన్స్ లో దుమ్ముదులిపింది. మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా పాతిక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా 4 రోజుల్లో 14.73 కోట్లు వసూళ్లు రాబట్టింది.

సినిమా మొదటి షో టాక్ మిక్సెడ్ గా వచ్చినా సరే కలక్షన్స్ మాత్రం అదరగొడుతున్నాయి. చైతు కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా శైలజా రెడ్డి అల్లుడు జోరు కొనసాగిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా ఏరియాల వారిగా నాలుగు రోజుల కలక్షన్స్ వివరాలు ఇవే..

నైజాం : 3.67 కోట్లు

సీడెడ్ : 2.09 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.35 కోట్లు

ఈస్ట్ : 1.30 కోట్లు

వెస్ట్ : 0.78 కోట్లు

గుంటూరు : 1.13 కోట్లు

కృష్ణా : 0.84 కోట్లు

నెల్లూరు : 0.49 కోట్లు

ఏపి/తెలంగాణా : 11.65 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.63 కోట్లు

ఓవర్సీస్ : 1.45 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా : 14.73 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version