మహాకూటమిలో ఇప్పటికీ సీట్ల పంచాయతీ తేలలేదు…ఇప్పటిలో తేలదు కూడా అంటూ తెరాస నేత, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగులూరులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి తెరాస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాకూటమిని గెలిపిస్తే మరోసారి ఆంధ్ర పాలకుల పెత్తనం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.. ఫార్మాసిటీని కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారన్నారు.. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ సింహంలా సింగిల్‌గానే వస్తున్నారన్నారు. పొరపాటున మహాకూటమి గెలిస్తే సీఎం ఎవరు అనేది ఎవరికీ తెలియదన్నారు. తెరాస తరుఫున సీఎం కేసీఆర్ అని ధైర్యంగా చెబుతున్నా..అదే విషయాన్ని మహాకూటమి గాని లేదా కాంగ్రెస్ నాయకులుగాని చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ లో నాయకుడు లేడు…తెదేపాకు కేడర్ లేదంటూ పేర్కొన్నారు.