దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం పలుమార్గాల్లో ప్రత్యేక రైళ్లను పొడిగించింది. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి కి పలు స్టేషన్ల మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపాలని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.పండుగకి ప్రయాణికులు వారి యొక్క సొంత ఊర్లకు అధిక సంఖ్యలో వెళ్తారు కావున రద్దీకి అనుకూలంగా 10 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ మధ్య రాకపోకలు కొనసాగిస్తాయని వెల్లడించారు.
హైదరాబాద్-నర్సాపూర్, తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడటౌన్-లింగంపల్లి రైల్వే స్టేషన్ ,తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే సంక్రాంతి పండుగ కి కాచిగూడ-కాకినాడటౌన్, హైదరాబాద్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎస్ సిఆర్ వెబ్సైట్ లో పొందుపరిచామని తెలిపారు.