యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు 2018 ఫలితాలను గురువారం విడుదల చేసింది. మెయిన్స్ లో 1994 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు అర్హత సాధించినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. అధికారిక వెబ్ సైట్ upsc.gov.in, upsconline.nic.in వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షలు 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసెస్‌తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఉద్యోగాల నియామకాల కోసం మెయిన్స్ పరీక్షను నిర్వహించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి పర్సనాలిటీ టెస్ట్ లేక ఇంటర్వ్యూ నిర్వహిస్తామని కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు…
-