గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్న రాకేశ్ ఆస్థానా పై ఆ సంస్థ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని కేసు నుంచి తప్పించడానికి లంచం తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదుచేశారు. మరో అడుగు ముందుకేసీ ఆస్థానాను విధుల నుంచి తప్పించేందుకు కి అనుమతివ్వాలని ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ కోరారినట్లు సమాచారం. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఆస్థానా అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణం, విజయ్ మాల్యా లాంటి ముఖ్యమైన కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాలకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.. హవాలా మార్గంలో విదేశాలకు నిధులు తరలిస్తున్నాడనే ఆరోపణలతో మెయిన్ ఖురేషీపై అనే వ్యాపారిపై సీబీఐ వివిధ కేసులను నమోదు చేసింది. ఈ కేసులను సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ ఆస్థానా పర్యవేక్షిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సనా సతీశ్‌బాబు పాత్రపై సీబీఐ దృష్టిసారించింది. అయితే ఈనెల 4, 16 తేదీల్లో ఓ మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో సీబీఐకి రూ.5 కోట్ల లంచమిస్తే సమన్ల నుంచి ఊరట కలిగిస్తానని మనోజ్ ప్రసాద్ అనే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సతీశ్‌కు హామీ ఇచ్చాడు. లండన్‌లో ఆస్థానా పెట్టుబడులను తన సోదరుడు సోమేశ్ ప్రసాద్ పర్యవేక్షిస్తుంటాడని, దర్యాప్తు సంస్థలకు చెందిన సీనియర్ అధికారులతో తనకు పరిచయాలున్నాయని తెలిపాడు. ఐపీసీ సెక్షన్ 164 కింద నమోదు చేసిన ఈ వాంగ్మూలంపై ఆస్థానాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆయనతోపాటు డీఎస్పీ దేవేందర్ కుమార్, మనోజ్ ప్రసాద్, సోమేశ్ ప్రసాద్, ఇతర మధ్యవర్తుల పేర్లను అందులో చేర్చారు. దీంతో ఇప్పటికే రాఫెల్ కుంభకోణం ఆరోపణలపై భాజపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆస్థానపై కేసు నమోదు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.