టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం. హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.ఈ మూవీ సక్సెస్ పై ప్రేక్షకులే కాకుండా ప్రముఖులు కూడా ఎంతో మెచ్చుకున్నారు.
తాజాగా బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్’పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. స్నేహితులతో కలిసి చిత్రాన్ని వీక్షించిన ఆయన.. దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయన్నారు. తేజా, అమృత అయ్యర్, వరలక్ష్మి నటన ఆకట్టుకుందని ట్వీట్ చేశారు. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.