తనపై విమర్శలు చేసిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారని మంత్రి రోజా అన్నారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆమె స్పందించారు. ఆరోపణలు చేసిన వారే అమ్ముడుపోయి విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్ పై సొంత చెల్లెలే విమర్శలు చేస్తున్నప్పుడు….తనమీద ఇలాంటి వాళ్ళు బురద చల్లడంలో ఆశ్చర్యం లేదన్నారు. నాన్ లోకల్ పొలిటీషియన్స్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ షర్మిల విలువ లేదని మంత్రి రోజా అన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది ఇప్పుడు ఆమె మాటలకి అర్దం లేకుండా పోయిందన్నారు రోజా.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వాడు నా గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. పదేళ్లలో ఒక్క రూపాయి తీసుకోలేదని అన్నారు. ఒంగోలులో నుండి నేను పోటీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నగరిలో ఉన్న నాకు ఒంగోలు కి పోవాల్సిన అవసరం లేదని అన్నారు రోజా. పెద్దిరెడ్డి గురించి ఆదిమూలం మాటలు బాధపెట్టాయి అన్నారు ఆయన గెలిపించింది పెద్ద రెడ్డి అని అన్నారు.