తెరాస అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది తాజా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈ ఇద్దరు నేతలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు… ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… హరీశ్, నేను సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామన్నారు, ఉద్యమకాలం నుంచి హరీశ్ పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేశానని గుర్తు చేశారు. ఇద్దరం కలిసి ఒకే క్యాబినెట్లో పనిచేసే అవకాశాన్ని తెలంగాణ ప్రజలు తమకి కల్పించారన్నారు.
కేసీఆర్ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల కారణంగా మరో 15 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని మేము కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరు అనుకున్నట్లు బావ హరీశ్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు….తమ మధ్య తెలంగాణ అభివృద్ధి సాధించాలనే పోటీ ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. పాలన, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తమ మధ్య పోటీ ఉంటుంది.. కేటీఆర్ కు,తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని హరీశ్ రావు ప్రకటించారు. సిద్దిపేట, సిరిసిల్ల ప్రజలు, తెరాస కార్యకర్తలు మరోసారి మా ఇద్దరికి భారీ మెజార్టీని ఇవ్వాలని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు.