అరుదైన ఘ‌న‌త అందుకున్న 12th ఫెయిల్.. ‘లెటర్‌బాక్స్’ మోస్ట్ పాపులర్ మూవీగా రికార్డు

-

బాలీవుడ్ న‌టుడు విక్రాంత్ మాస్సే లేటెస్ట్ గా న‌టించిన‌ చిత్రం 12th ఫెయిల్. ఈ చిత్రం చిన్న సినిమాగా విడుద‌లై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం రూ.20 కోట్ల బ‌డ్జెట్‌తో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రూ.64 కోట్లు వ‌సుళ్లు చేసింది. హాలీవుడ్ మూవీ రేటింగ్స్ సంస్థ‌ లెటర్‌బాక్స్ ఇచ్చిన టాప్-రేటెడ్ డ్రామా మూవీస్‌ల‌లో 12th ఫెయిల్ స్థానం సంపాదించుకుంది. ఈ విష‌యాన్ని లెట‌ర్ బాక్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

 

ప్రముఖ ఓటీటీ దిగ్గ‌జం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో కూడా రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.ఈ చిత్రం డిసెంబ‌ర్ 29 నుంచి స్ట్రీమింగ్ అవుతుండ‌గా.. రిలీజ్ అయిన రోజు నుంచే పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకొని.. హాట్‌స్టార్‌లో టాప్ టెన్‌లో నిలిచింది.

ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. . నటుడు విక్రాంత్ మాస్సే ఈ చిత్రంలో మనోజ్ అనే IPS ఆస్పిరంట్‌గా క‌నిపించాడు. చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి UPSC ప్రిపరేషన్ కోసం ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌కు వ‌చ్చిన విక్రాంత్ అక్క‌డ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది కథాంశం. ఇక UPSC కోసం ప్రయత్నించే లక్షలాది విద్యార్థుల నిజమైన క‌థ‌ల నుంచి ఈ మూవీని తెరకెక్కించారు.

Read more RELATED
Recommended to you

Latest news