The Kerala Story OTT: ఎట్టకేలకు ఓటీటీలో ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

సాధారణంగా థియేటర్లలో విడుదల అయిన సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తాయి. అయితే కొన్ని చిత్రాలు నెలల తరబడినా ఓటీటీలోకి రావడం లేదు. అందులో అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా ఒకటి. డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.మే 5న విడుదలైన ఈ కాంట్రవర్సీ సినిమా లాంగ్‌ రన్‌లో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం బడ్జెట్‌ కేవలం రూ. 35 కోట్లే . కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌ , తమిళనాడు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించుకుండా నిషేధం విధించారు.

 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5 ది కేరళ స్టోరీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న లేదా 12వ తేదీ నుంచి ది కేరళ స్టోరీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానుందని తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ,తమిళ భాషల్లోనూ ది కేరళ స్టోరీ అందుబాటులో ఉండనుందని సమాచారం. అయితే ఈ విషయంపై అటు చిత్ర నిర్మాతలు కానీ,ఓటీటీ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమాలో యోగితా బిహానీ, సోనియా బలానీ,సిద్ధి ఇద్నాని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news