Guntur Kaaram : విడుదలకు ముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్‌ చేసిన ‘గుంటూరు కారం’

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైనటువంటి పాటలకు మంచి స్పందన లభిస్తుంది. అయితే ఈ చిత్రం తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది.

ఈ చిత్రాన్ని అమెరికాలో భారీ ఎత్తున సుమారు 5000లకు పైగా ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.

అయితే ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో అత్యధిక ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయిన సినిమాగా RRR (5408 షోలు)రికార్డును గుంటూరు కారం సినిమా బ్రేక్ చేయనుంది.అయితే ఈ రికార్డును ఈ చిత్రం 5408 షోల‌తో బ‌ద్ద‌లుకొట్ట‌బోతుంది అని అంటూ చిత్ర‌యూనిట్ తెలిపింది. మరోవైపు ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అనుకోని కారణాలవల్ల పోలీసులు పరిమిషన్ రద్దు కావడంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news