ఆధార్‌ కు సుప్రీం ఓకే

-

ఆధార్ కార్డుకు సుప్రీం కోర్టు ఓకే చెప్పింది. ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై  విచారణ చేపట్టిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపి నేడు తీర్పు వెలువరించింది. తీర్పుని జస్టిస్‌ ఏకే సిక్రి మెజార్టీ తీర్పును చదివి వినిపించారు…. ఆధార్‌ అనేది జాతీయ గుర్తింపు కార్డు  దీనితో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు కార్డు లభించిందని, దాని వల్ల వారికి సాధికారిత వచ్చిందని, ఇది రాజ్యాంగబద్ధమైనదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రి అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను, ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయంలో నకిలీల సమస్య తొలిగిపోయింది..  అదే అభ్యర్థి మరో సారి ఇతర వివరాలతో  ఆధార్‌ నమోదుకు వెళ్తే కంప్యూటర్‌ గుర్తిస్తుందని వివరించారు.

ఆధార్ నమోదు ప్రక్రియలో ప్రజల నుంచి  సాధ్యమైనంత కనీస సమాచారం మాత్రమే తీసుకున్నారని, దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని కోర్టు వివరించింది. ఆధార్‌ డేటా హ్యాకింగ్‌ చేశారనే వార్తలు అవాస్తవమని ప్రభుత్వం ఇప్పటికే కోర్టుకు వివరించింది. కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని  తెలిపింది.
ఆధార్ అవసరం లేదు…

బ్యాంకు ఖాతాలు తెరవడానికి, మొబైల్‌ కనెక్షన్లు, పాఠశాల అడ్మిషన్లకు, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ ఇతర పరీక్షలకు హాజరవ్వడానికి ఆధార్‌ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టంచేసింది. పాన్ కార్డు పొందడానికి, ఐటీ రిటర్న్స్ విషయంలో ఆధార్ అవసరమని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news