ఆర్టీసీ డిపో మేనేజరు పై వేటు

-

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఆర్టీసీ ప్రమాద ఘటనపై  ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిపో మేనేజరు హన్మంతరావును సస్పెండ్ చేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు. కొండ పైనుంచి కిందికి దిగుతున్న క్రమంలో చివరి మలుపు వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు, వేగంగా వస్తున్న బస్సు ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి లోయలో పడి ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని మంత్రి తెలిపారు. మృతుల‌ కుటుంబాలకు ఆర్టీసీ నుంచి రూ. 3లక్షలు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా రవాణలో ఆర్టీసీ వంటి కీలకమైన వ్యవస్థలో యాభై మందికి పైగా మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వ సాయంతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత, ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, మంత్రులు ఈటల, కేటీఆర్, మహేందర్ రెడ్డి తదితర నేతలు క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news