ఆ డైరెక్ట‌ర్ క‌థ చెప్తా అంటే ముందు వ‌ద్ద‌న్నాడ‌ట నాని.. ఇప్పుడు అత‌నితోనే సినిమా

-

ఆ డైరెక్ట‌ర్ నాకొక హిట్ సినిమా ఇచ్చాడు. ఇక దాని త‌ర్వాత మేమిద్ద‌రం బాగా క్లోజ్ అయ్యాం. ఆ మ‌ధ్య ఫోన్ చేసి ఓ క‌థ చెప్తా క‌లుద్దాం అన్నాడు. వద్దంటే బాగోదు క‌దా అని ఓకే చెప్పా. కానీ ఏ క‌థ చెప్పినా నో చెప్పాల‌ని ముందే ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఏదో మొహ‌మాటం కొద్ది వింటా అని చెప్పా. కానీ ఆ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ విన్నాక ఓకే చెప్ప‌కుండా ఉండ‌లేక‌పోయాను. ఎందుకంటే క‌థ అలా ఉంది మ‌రి అంటూ చెప్పుకొచ్చాడు నాచుర‌ల్ స్టార్ నాని.
ఇంత‌కీ ఆయ‌న చెప్పింది ఎవ‌రి గురించి, ఆ క‌థ ఏంటి అని తెలు‌సుకోవాల‌నుకుంటున్నారా మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ముందుకుప‌దండి.


నాని సినిమా కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో నిన్ను కోరి ఒక‌టి అన‌డంలో సందేహ‌మే లేదు. ఆ సినిమాలో నాని త‌న నటనతో అమ్మాయిల మ‌న‌స‌సు దోచేశాడు. ల‌వ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా న‌టించి మెప్పించాడు. ఆ స్థాయి న‌ట‌న ఎవ‌రూ చూపించ‌లేరంటూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటూ ముందుగానాని న‌ట‌న గురించే చెప్పాలి. ఎందుకంటే నాని ప‌ర్ఫార్మెన్స్ అలా ఉంటుంది మ‌రి.
ఇక ఈ మూవీని డైరెక్ట్ చేసిన శివ నిర్వానతో ప్ర‌స్తుతం ట‌క్ జ‌గ‌దీశ్ మూవీ చేస్తున్నాడు నాని. ఈ కథ చెప్పేందుకు కలుస్తానంటే ముందు ఒప్పుకోలేద‌ని, కానీ క‌థ విన్నాక ఒప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చాడు నాని. ఈ విష‌యాల‌ను తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అయితే ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ విష‌యం తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తి అయింది. రిలీజైన్ పోస్ట‌ర్లు, టీజ‌ర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. కొవిడ్ ఎఫెక్ట్ త‌గ్గాక మూవీని రిలీజ్ చేస్తామ‌ని నాని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version