ఆ నలుగురు నిర్దోషులు…

-


సూరి హత్య కేసులో తీర్పు వెలువరించిన నాంపల్లి కోర్టు 
గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో భానుకిరణ్‌ను దోషిగా తేలుస్తూ.. యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. భానుకు సహకరించిన మన్మోహన్‌కు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా ఖరారు చేసింది. హత్య నాటి నుంచి సూరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్బయ్య, హరిబాబు, వంశీ, వెంకటరమణలను నిర్దోషులుగా ప్రకటించింది.

2011, జనవరి 3న సూరీ అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్, డ్రైవర్‌ మధుమోహన్‌ జూబ్లీహిల్స్‌ నుంచి సనత్‌నగర్‌ వెళ్తుండగా యూసుఫ్‌గూడలోని నవోదయ కాలనీ సమీపంలో సూరిపై భానుకిరణ్‌ పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులు జరిపి హతమార్చాడనే ఆరోపణలపై కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించింది.8 ఏళ్లపాటు ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో మొత్తం 117 మంది సాక్షులను విచారించారు.

Read more RELATED
Recommended to you

Latest news