మెగా డాటర్ ‘సూర్యకాంతం’.. ఫస్ట్ లుక్ అదుర్స్..!

-

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా అడుగుపెట్టిన నిహారిక ఒకమనసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాలు చేసినా రెండు ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే నటన పరంగా నిహారికకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా మెగా డాటర్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే సుజనా డైరక్షన్ లో శ్రీయ శరణ్ తో పాటుగా ది లిటిల్ బర్ట్ మూవీలో నటిస్తున్న నిహారిక లేటెస్ట్ గా సూర్యకాంతం సినిమాతో వస్తుంది.

ప్రణిత్ బ్రమండపల్లి డైరక్షన్ లో వస్తున్న సూర్యకాంతం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసిన ప్రణీత్ మొదటి ప్రయత్నంగా చేసిన సినిమాగా సూర్యకాంతం క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నిహారికకు జోడీగా ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా మీద అంచనాలు పెంచారు.

నిహారిక సూర్యకాంతం అయినా మెగా డాటర్ కెరియర్ ను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి. తెలుగుతో పాటుగా తమిళంలో ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్ సినిమాలో కూడా నటిస్తుంది నిహారిక కొణిదెల.

Read more RELATED
Recommended to you

Latest news