ఆ వ్యక్తిని సీఎం పీఠం నుంచి దించేందుకే కూటమి..

-

తెలంగాణలో ప్రజావ్యవతిరేక విధానాలను అవలంబిస్తున్న తెరాస అధినేత కేసీఆర్ ని గద్దె దించేందుకే మహాకూటమిని ఏర్పాటు చేశామని  తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. ఈ సందర్భంగా తెజస పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇతర పార్టీ నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నార‌ని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు అందరూ కలిసి పోరాడుతున్నామన్నారు. కూటమిలో సీట్లపై ఎలాంటి ఇబ్బంది లేదు త్వరలోనే అందరం చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తామన్నారు. మార్పు కోసం జరుగుతున్న ఈ ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news