తెరాస నేతలపై మావోల టార్గెట్!

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మావోలు తమ ఉనికిని చాటుకునేందుకు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మేరకు  తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో హై అలర్టు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచించించారు. ముఖ్యంగా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన కొందరు నాయకులును టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందని జాతీయ ధర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌ లాంటి మావోయిస్టు ప్రాబల్యం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇదివరికే పోలీస్‌ శాఖను హైఅలర్టు చేసిన విషయం తెలిసిందే.   ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా దండకారణ్యంలో గత రెండు నెలలుగా మావోయిస్టులు ఎన్నికలపై ప్రత్యేక ప్రణాళిక రచించనట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు  అలర్టుగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఎజెన్సీ, అటవీ ప్రాంతాలకు వెళ్లేముందు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజాప్రతినిథులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news