సెంచూరియన్ లో భారత్ తో జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆతిథ్య సౌత్ ఆఫ్రికా భారీ స్కోరు నమోదు చేసింది. ఎల్గర్ 185 పరుగులు చేయగా, మార్క్ జాన్సన్ 84 (నాట్ అవుట్) డేవిడ్ బెడింగ్ 56 పరుగులు చేయడంతో సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్లో గాయం కారణంగా కెప్టెన్ బవుమ బ్యాటింగ్ చేయలేదు. ప్రస్తుతం సఫారీ జట్టు 163 పరుగుల ఆదిక్యంలో ఉంది. టీం ఇండియా బౌలర్లు బుమ్ర 4 వికెట్లు , మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, శార్డుల్ ఠాగూర్, ప్రసిద్ధి కృష్ణ ,రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.
అయితే టాస్ గెలిచిన సఫారీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఇండియా 245 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆట మూడో రోజు జరుగుతుండగ ఇంకా ఆటకి రెండున్నర రోజులు సమయం ఉండడంతో ఫలితం పై ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా …రెండో ఇన్నింగ్స్ లో పరుగులు ఏమి చేయకుండానే కెప్టెన్ రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. యశశ్వి జైశ్వాల్ 5 పరుగులకు అవుట్ అయ్యాడు. గిల్ , విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉన్నారు.