కెనరా బ్యాంక్ లో ఖాతా ఉందా…? అయితే మీరు వీటి కోసం తప్పక తెలుసుకోవాలి. కెనరా బ్యాంక్ తాజాగా వడ్డీ రేట్లను సవరించింది. ఇక వివరాల లోకి వస్తే… పలు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు తగ్గించింది. అలానే మరి కొన్ని ఎఫ్‌డీల పై వడ్డీ రేట్లు పెంచింది. ఇప్పటికే అన్ని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించాయి. తాజాగా కెనరా బ్యాంక్ కూడా అలానే చేసింది. కెనరా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ కొత్త రేట్లు రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలకి వర్తిస్తాయట.
ఏడాది కాల పరిమితి లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేసింది. కెనరా బ్యాంక్ రెండేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితి లోని ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను పెంచేసింది. ఇది ఇలా ఉండగా ఈరోజు నుంచే అమలు లోకి వస్తున్నాయి. అయితే ఈవాళ నుండి మారనున్న రేట్లను చూస్తే… కొత్త రేట్ల ప్రకారం 7 నుంచి 45 రోజుల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 2.95 శాతం వడ్డీ లభిస్తుంది.
అదే 46 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 3.9 శాతం, 91 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై 4 శాతం, 180 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 4.45 శాతం అందిస్తోంది. అయితే ఏడాది కాల పరిమితి లోని ఎఫ్‌డీలపై ఇప్పుడు 5.2 శాతం వడ్డీ లభిస్తోంది. అదే ఏడాది నుంచి రెండేళ్ల కాల పరిమితి లోని ఎఫ్‌డీలకు కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుంది. ఒకవేళ రెండేళ్ల నుంచి మూడేళ్లలోని ఎఫ్‌డీలు అయితే 5.4 శాతం, మూడేళ్ల నుంచి పదేళ్ల లోపు ఎఫ్‌డీల పై 5.5 శాతం వడ్డీ రేటు వస్తుంది.