ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకా సొంతం : సీఎం రేవంత్‌ రెడ్డి

-

డబ్బులు ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారు అనే ఆలోచన పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల్లోకి వెళ్లి వారికి సేవ చేస్తే ఆదరిస్తారని అన్నారు.శుక్రవారం హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ అలుమ్నీ మీట్, గ్రాడ్యుయేషన్ డేలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ లను చూస్తే రామాయణంలోని లవకుశలు గుర్తుకు వస్తారని అన్నారు. ఎంత సంపాదించాం అనేది కాదు ప్రజలకు ఎంత పంచామనేది కాకా విధానమని రేవంత్ రెడ్డి అన్నారు.

 

గత 50 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులని తీర్చిదిద్దిన ఘనత కాకది అని చెప్పారు. ఎలాంటి లాభపేక్షలు లేకుండా విద్యార్థులకు విద్యను అందిస్తున్న కుటుంబం కాకా గారిది అని పేర్కొన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కాకా గారి కుటుంబం ముందు వరుసలో ఉందని తెలిపారు. అలాగే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా కాకా పేరు మీదనే ఉందని తెలియజేశారు. దేశంలో గాంధీ గారి కుటుంబం ఎలాగో తెలంగాణలో కాకా గారి కుటుంబం అటువంటిది అని అన్నారు. డ్రగ్స్ మద్యం వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా కాలేజ్ టైం లోనే బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని హితబోధ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news